Sunday, April 12, 2009

సర్వే లు , ఫలితాలు .... వాస్తవాలు ....

ఈ మధ్య అన్ని పత్రికలూ, చానల్స్ రక రకాల ఏజెన్సీ లతో సర్వే లు చేపించి , వాటి ఫలితాలను ప్రజల మీదకు యదేచ్చగా వదులు తున్నాయి . ఐతే ప్రస్తుతం మన రాష్ట్రం లో నెలకొనివున్న ప్రత్యేక పరిస్థితులు వాటి ఫలితాలును నిజం గా ఈ సర్వేలు ప్రతిబింబిస్తున్నాయ అనేది పూర్తిగా అనుమానాస్పదం .

ఇందులో విశేషం ఏమిటంటే , ఈ సర్వే లు చేసే పత్రికలూ కాని చానల్స్ కాని ఈ సర్వే లకు ఎ మాత్రం భాద్యత వహించవు, తమ ముసుగులు ఐన ఈ సర్వే ఏజెన్సీ ల పేరుతో ఫలితాలను తమకు అనుకూలం ఐన పార్టీ లకు లాభం కలిగించేలా విడుదల చేస్తున్నై అనే తీవ్రమైన అనుమానాలు వున్నాయి .

.... రేపొద్దున్న ఏమైనా తేడాలు వస్తే , మాకు ఏమి సంబంధం లేదు , కేవలం ఆ ఏజెన్సీ చేసిన సర్వే తాలూకు ఫలితాలు మాత్రమే మేము ఇచ్చాము అని ఎంచక్కా తప్పించుకోవచ్చు.
.... మన దేశం లో ఇంతవరకు ఎ సర్వే ఏజెన్సీ కూడా వరసగా రెండు మూడు ఎన్నికల లో , కచ్చితమయిన pre poll projections ఇచిన విశ్వసనీయమయిన ఏజెన్సీ కూడా ఏది లేదు .

.... సరే మరి ఇంతకూ ఈ సర్వే లు మన రాష్ట్రం లో కింది విషయాలను పరిగణన లోకి తీస్కున్నాయా అనేది అనుమానమే ....

- తెలంగాణా వాదం
- PRP ఖాతా లో పడనున్న ఒక బలమయిన సామాజిక వర్గ వోట్లు (ఇందులో మెజారిటీ వోట్లు ఇంతకు ముందు కాంగ్రెస్ కి దక్కేవి అనేది ఒక విశ్లేషణ )
- తెలుగుదేశం వోట్ల మీద లోక్ సత్తా చూపనున్న ప్రభావం
- ఎంతో కొంత ప్రబావం చూపనున్న నగదు బదిలీ మరియు వుచిత కలర్ టీవీ

ఇవి కీలకమయిన విషయాలు ఎందుకంటే , ఇంతకు ముందు నాలుగు ఐదు ఎన్నికల్లో , తెలుగు దేశం కాంగ్రెస్ ఎవరి వోట్లు వారికి పోల్ కాగ , తటస్తులు ఎవరి వయిపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారం చేపట్టేది .

ప్రస్తుతం కొత్తగా వచ్చిన PRP , లోక్ సత్తా తో పాటు , మహా కూటమి గా మారిన ప్రతిపక్షాలు , వీటితో తటస్థులు అనే వర్గం పూర్తిగా కుంచించుకు పోయి , అందరు ఏదో ఒక పార్టీ అని డిసైడ్ అయిపోయిన ప్రత్యేక పరిస్థితులు ఈ ఎన్నికల్లో కనబడుతున్నాయి . ఈ పరిస్థితుల్లో ఎ నియోజకవర్గం లో ఎ పార్టీ గెలిచినా అతి తక్కువ మెజారిటీ తో బయటపడే సూచనలు కనబడుతున్నాయి . ఈ మెజారిటీ లో కూడా పైయిన చెప్పిన విషయాలు కీలక భూమిక వహిస్తాయి .

ఈ పరిస్థితుల్లో , ఎ ఏజెన్సీ కూడా ఎంత నిజాయితి గా సర్వే చేసినా కూడా అసలైన ఫలితాలను ప్రతిబింబించలేని పరిస్తితి .

సరే వీటిని పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రం లో ప్రధాన పార్టీ ల పరిస్థితులు ఇలా వున్నాయి.

కాంగ్రెస్ : ఉత్తర తెలంగాణా లో పూర్తిగా దక్షిణ తెలంగాణా (ఖమ్మం , మహబూబ్నగర్ .....) లో చాల వరకు , ఉభయ గోదావరి జిల్లాలు ల లో పూర్తిగా ఆశలు వదులు కున్న పరిస్తితి .

PRP : తెలంగాణా లో పూర్తిగా (దేవేందర్ గౌడ్ నియోజక వర్గాలతో సహా ) , రాయలసీమ లో అనంతపూర్ , కడప ల లో పూర్తిగా , నెల్లూరు , ప్రకాశం వంటి చోట్ల మెజారిటీ నియోజకవర్గాల్లో పోటి లో లేని పరిస్తితి ....
.
మహాకూటమి : ఫలితాలు ఎలా వుండబోతున్నా , ఉత్తరాంధ్ర , హైదరాబాద్ పాతబస్తీ , కోస్తా లోని అతి తక్కువ నియోజక వర్గాలు మినహాయించి , రాష్టం లోని మిగతా అన్ని నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్ధులు ప్రధాన పోటిదారులు గా వున్నారు .

ఎవరండి ఈ బిల్లి రావ్ .........

సాక్షి ఆదివారం లో ఒక సీరియల్ వస్తుంది మనీ మనీ మనీ అని .... అందులో హీరో విజయ్ కి , క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాయర్ హీరో రౌడీ వేషాలతో ముచటపడి "బొల్లారం" లో తన భోజన హోటల్ పక్కన వున్న ఖాలీ స్థలాన్ని స్టార్ హోటల్ కట్టుకోమని హీరో కి ఇచ్చేస్తాడు, బహుశా ఒక నాలుగు ఐదు వారల క్రితం అనుకుంటా ఇది జరిగింది . ఈ ఆదివారం సీరియల్ క్లైమాక్స్ కి వచేసరికి .... బొల్లారం లోని ఆ స్టార్ హోటల్ కాస్తా శంషాబాద్ ఐర్పోర్ట్ కి పక్కగా , ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లను ఆనుకుని , ఔటర్ రింగ్ రోడ్ కి అభిముఖం కా జరుగు కుంటూ వచ్చ్చేసింది . ఇది ఎలా జరింగిందో రాసిన వారికి , ప్రచురించిన వారికి మాత్రమె తెలిసి వుంటుంది . పాఠకులు , వీక్షకులు పిచ్చి వాళ్ళుఅని వారు అనుకుంటారు కాబట్టి ఏమైనా రాయోచు ...ఏమైనా చూపించవచ్చు .

... ఈ సీరియల్ ప్రేరణతో నే అనుకుంటా ఈ రోజు సాక్షి పేపర్ లో బిల్లి మెడలో బాబు గంట అనుకుంటూ , ఒక తలా తోక లేని కథనం , వారి ఛానల్ లోనే దానికి దృశ్య రూపం చూపించారు .

సరే ఈ కథ మొత్తం చదివి .... చూసిన తరవాత నాకు వచ్చిన సందేహాలు ఇవి ....

..... బాబు ఈ భూమి ని IMG భారత కి ఇచినప్పుడు దాని చైర్మన్ అసలు IMG కి చెంది వ్యక్తి అని , ఈ బిల్లి రావ్ కేవలం ఒక డైరెక్టర్ అని వారే రాసారు . తర్వాత ఈ బిల్లి దాని చైర్మన్ ని మోసం చేసి కంపెనీ ని హస్తగతం చేస్కోవడానికి కూడా ప్రయత్నం చేసాడు అని కూడా రాసారు ( ఈ సంధి కాలం లో బాబు అధికారం కోల్పోయారు అని కూడా వారే సెలవిచ్చారు ) . సో బాబు అసలు వ్యక్తులకే భూమి ఇవ్వాలని చూసారు ... కంపెనీ లోని అంతర్గత కలహాలకి బాబు కి ఏమిటి సంబంధం ??
బాబు బిల్లి కి సన్నిహితుడు అనే పదే పదే చెప్పడం తప్ప దానికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం ఏమి చూపించలేదు .

.... సాక్షి ఈ రోజు చెబుతున్న ఆ భూమికి కట్టిన విలువ ..... ఇరవై వేల కోట్లు . 2003 లో ఆ భూమి అప్పగించినప్పుడు విలువ ఎంత ? ఆ సమయం లో గచిబౌళి , మామిడి పల్లి లో నిరుపయోగం గా పడి వున్న స్థలాలు అవి .

.... సరే ఇంతలో కొత్త రాజా వారు అధికారం లోకి వచ్చారు ..... ఈ మొత్తం వ్యవహారాన్ని బోగస్ మరియు మోసం గా గుర్తించి , ఈ మొత్తం భూ కేటాయింపు ని రద్దు చేసారు . మరి ఈ బోగస్ కంపెనీ .... ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్ట్ వరకు ఎలా తీస్కేల్ల గలిగింది ? ఐదు సంవత్సరాలు అధికారం లో వున్న ప్రభుత్వం ఇన్ని రోజులు దాని ఒక బోగస్ కంపెనీ గా ఎందుకు రుజువు చెయ్యలేక పోయింది . ??
.... బిల్లి రావ్ గారి తలా తోక లేని డైలాగు లని రహస్యం గా చిత్రీకరించిన బిల్లి రావ్ గారి సన్నిహితుడు ..... ఈ టేపు లను సాక్షి కే ఎందుకు అందజేశాడు ? అంటే ఇతను సాక్షి యాజమాన్యానికి కూడా సన్నిహితుడా ?? అందరు ఒకరి కి ఒకరు సన్నిహితులు కాబట్టి .... అందరు కలిసి ఆడిన నాటకం గానే ఇది వుంది. ఆ వీడియో చూసిన వార్కి కూడా ఇదే అనుమానం వస్తుంది ..... వాడింది స్పయ్ కెమెరా అయినా చిత్రీకరణ మాత్రం అత్యంత సహజం గా వుంది ..... అవతలి వ్యక్తి నుంచి వూ వూ అన్నా సౌండ్ తప్ప .... ప్రశ్న అడిగిన దాకలాలు కనిపించవ్.

...... వొడి పోతున్నామనే ప్రమాద ఘంటికలు చాలా గట్టిగ మోగుతుంటే ..... నగదు బదిలీ వంటి ప్రచారాస్త్రాలను పక్క దారి పట్టించటానికి పన్నిన ఒక ఎత్తుగడ గానే దీన్ని బావించాలి .

మరో నాలుగు రోజుల్లో .... ఎన్నికలు ..... చేసింది ఏమి లేదు ...చెప్పుకోవడానికి ఏమి లేదు .... మిగిలిందల్లా బురద జల్లడం .... ఎదురు దాడి కి దిగడం ....

Wednesday, March 18, 2009

వాడుకుని వదిలెయ్యక ఏమి చెయ్యాలి ...... ?

ఈ మధ్య అందరు తెగ బాధపడుతున్నారు ..... చంద్రబాబు వాడుకుని వదిలేసే రకమని , బాలయ్య , జూనియర్ ఇద్దరినీ ఎన్నికల్లో వాడుకుని తర్వాత వదిలేస్తాడు అని , చంద్రబాబు నైజమే అది అని , బాబు బుట్టలో పడొద్దని ఉపదేశాలు ఇస్తున్నారు .
సరే మరి ఏమి చేస్తే బాగుంటుంది . పత్రికలూ , చానల్స్ పెట్టుకోమని వందల కోట్లు దోచిపెట్టాలా ? సెజ్ లు రాసివ్వాలా ?
ఎన్నికల్లో వుపయోగ పడ్డారని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి రాష్ట్రాన్ని ఏలుకోమని చెప్పాలా ? అడిగినవారికి కాదనకుండా ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టాలా ? నామినేషన్ పద్దతుల్లో వందల కోట్ల కాంట్రాక్టులు అప్పగించాలా ?

ముఖ్యం గా తెలుగు వారు చాలా మంది , తమకి ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు కాని , నమ్మిన వారికి అన్యాయం చేసాడు అని తెగ బాధపడతారు .
తమ బంధు మిత్ర సపరివారానికి అన్ని రకాలుగా సహాయం చేస్తుంటే , అదేదో తమకే అందినంత తృప్తి పడతారు .

ఈ బలహీనత చూస్కునే , మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశాల్లో బహిరంగం గానే నమ్మిన వారికి అన్ని రకాలు గా సహాయం చేశాను అని చెప్తుంటారు .
అది కాకుండా ప్రచారం కూడా .... చంద్రబాబు గుంట నక్క అని , నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుతాడు అని . అంతెందుకు చాల మంది బాబు అభిమానులు కూడా , మా నాయకుడి లో ఇదొక్కటే లోపం అని చెప్తుంటారు .

వ్యక్తిగత జీవితం లో ఈ నమ్మిన వారిని ఆదుకొవడం అనే కాన్సెప్ట్ బాగానే వుంటుంది .... కాని అధికారం లో వుండే వాళ్ళు కూడా అలానే వుండాలి అని ఆశిస్తే ఏమి జగుతుందో , గత 5 సంవత్సరాలుగా చూస్తూనే వున్నాము . అధికార పార్టీ నాయకులూ వారి బంధువులు మిత్రులు ..... తామే వుహించని సంపదని కూడబెట్టారు , మనం మాత్రం నమ్మిన వారిని నెత్తిన పెట్టుకునే నాయకుడికి అధికారం అప్పగించామని తృప్తి గా వున్నాము .

ప్రజలు ఆకర్షించే శక్తి గల కుటుంబ సభ్యులు వున్నప్పుడు .... వారిని ప్రచారాని కి వాడుకోవటం లో తప్పేముంది . అధికారం లోకి వచ్చిన తర్వాత వారిని ప్రభుత్వ కార్య కలాపాలకు దూరం గా వుంచటం వదిలెయ్యడం ఎలా అవుతుంది .
తొమ్మిది సంత్సరాలు అధికారం లో వున్నా బాబు ...ఎ రోజు కుటుంబ సభ్యులను అధికార విధుల్లో జోక్యం చేసుకోనివ్వలేదు . ఎవరి మీద ఆరోపణలు కూడా రాలేదు .

వాడుకుని వదిలేసే టైపు (కుటుంబ సభ్యులని ), తన నీడని తానె నమ్మడు , అనుమానపు మనిషి , పని రాక్షసుడు , ఇవన్ని వున్నవాడు అధికారం లో వుంటేనే అసలు ప్రజలకి మేలు జరుగుతుంది .
అభిమానుల ఆశలు ఫలించి ,బాబు మళ్ళి అధికారం లోకి వస్తే తన పూర్వ పంధానే కొనసాగించాలని కోరుకుంటున్నాను .

Sunday, March 15, 2009

జూనియర్ తో వణుకుతున్న కాంగ్రెస్ ...... ?

.... అవునా కాదా అని అనుకుంటున సమయం లో .. జూనియర్ ప్రచారం పై ఈ రోజు కాంగ్రెస్ శాసన సభ పక్షం ఇచిన ప్రతిస్పందన , దానికి సాక్షి పత్రిక తన మొదటి పేజి లో సగం , రెండవ పేజి లో సగం భాగం కేటాయించడం చూస్తుంటే .... అవును నిజమే .... జూనియర్ ని చూసి కాంగ్రెస్ వనుకుతుంది .... దానికే సాక్ష్యం ఈ రోజు "సాక్షి" .

Monday, March 9, 2009

తెలుగు దేశం - తెలంగాణా వాదం ?

సమైక్య వాదానికి కట్టుబడ్డ వ్యక్తి గా గౌరవమ్ ఇచ్చిన వారందరూ ఎన్నికల్లో నిండా ముంచిన విషయాన్ని చంద్రబాబు ఎలా మర్చి పోగలరు ? ( ముఖ్యం గా కృష్ణ , గుంటూరు , ప్రకాశం , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు .) అదే సమయమ లో సమైక్య వాద పార్టీ గా తెలంగాణా వాదుల మద్దతు కోల్పోయిన విషయాన్ని గమనించ కుండా ఎలా వుండగలరు .
తెలంగాణా లో TRS తో కాంగ్రెస్ కాని తెలుగుదేశం గాని ఎ ఒక్క పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ కూటమి తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది అని సర్వే ల తో నిమిత్తం లేకుండా అన్ని ఎన్నికలు రుజువు చేస్తున్నప్పుడు చంద్రబాబు చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి . కాంగ్రెస్ కి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? సమైక్య వాదుల మద్దతు లేని సమైక్య వాదాన్ని సమర్ధించడం కంటే , తమకు మద్దతు ఇస్తే చాలు తమ అభిమానాన్ని వోట్ల వర్షం గా కురిపిస్తున్న తెలంగాణా వాదానికి మద్దతు పలకడం దిగజారుడు తనం ఎలా అవుతుంది ??

సమైక్య వాదం ఒక వాదం మరియు నినాదం మాత్రమె ..... దానికో వుద్యమ రూపు కాని , వోటు బ్యాంకు కాని లేవు . సమైక్య వాదులకు , సమైక్య వాదం అనేది ఎన్నికల్లో ఒక అంశమే కాదు . వారికి గుర్తోచినప్పుడల్లా కలిసుంటే బావుంటుంది అని మాత్రం అంటారు .

పోనీ వోట్ల సంగతి పక్కన పెడితే ,
తెలంగాణా లో మెజారిటీ ప్రజలు తెలంగాణా ను కోరడం వాస్తవం . తెలంగాణా వుద్యమ పార్టీ TRS , గెలిచిన సీట్ల తో సంబంధం లేకుండా తెలంగాణా లో పెద్ద పార్టీ గా అవతరించడం వాస్తవం . ఈ పరిస్థితుల్లో, తెలుగువారి ఆత్మగౌరవం నినాదం తో పుట్టిన తెలుగు దేశం, తెలుగువారి మనోభావాలను (ఎ ప్రాంతం ఐన సరే ) కూడా అదే స్తాయి లో గుర్తించాలి .... దాని కోసం తన వాదాలను మార్చుకోవడం లో లేదా సమీక్షించుకోవడం లో ఏమి తప్పు లేదు .




Friday, November 21, 2008

జిందాబాద్ రామోజీ .....

ఈనాడు ని , రామోజీ ఇతర వ్యాపారాలను దెబ్బతీయటానికి పలు రకాలుగా ప్రయత్నించి , తమ వల్ల కాదు అని ఆలస్యం గా కళ్లు తెరిచిన సాక్షి యాజమాన్యం , తెలుగు మీడియా లో రామోజీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ , రామోజీ పబ్లిక్ పర్సనాలిటీ గా మారడం వల్ల ఆయన కుటుంబ వ్యవహారాలు ప్రజలకి తెలియ చెప్పాలనే ఈ ఇంటర్వ్యూ ప్రచురిస్తున్నాం అంటు తమ అతి తెలివిని , లేకితనాన్ని బయటపెట్టుకున్నారు.

కళ తప్ప మరొకటి తెలియని ఒక సకల కళా వల్లభుడి అజ్ఞానం అమాయకత్వం ఆసరాతో , ఆయనకు ఇహలోక జ్ఞానం ప్రసాదించడానికి పంపబడ్డ ఒక దూత సహకారం తో , రామోజీ కుటుంబాన్ని బజారుకీడుద్దామన్న కుటిల యత్నం లో సాక్షి బొక్క బోర్లా పడిందని ఇంటర్వ్యూ చదివిన వాళ్ళందరి మాట.

మొత్తం ఇంటర్వ్యూ జాగ్రత్త గా చదివిన తర్వాతా రామోజీ మీద గౌరవం మరింత పెరిగింది .

ఎవరికైనా తెర మీద కనపడాలనే కుతి ఎక్కువ గా వుంటే , తమ పెట్టుబడి తో పెట్టుకున్న ఛానల్ లో తమ ప్రతిష్త పెరిగే కార్యక్రమాలను రూపొందిచుకుంటారు . కాని ప్రత్యేక దూత ల చెప్పుడు మాటలు విని , విచిత్రమైన వేషాలతో కోట్ల మంది ప్రజల ముందు తన పరువు తానె తీసుకుంటున్న క్రమం లో , వీల్లిద్దరిని వెళ్ళగొట్టి ఛానల్ పేరు ని కొడుకు పరువు ని రామోజీ కాస్తైనా నిలబెట్టారు .

అదీ గాక ఈ సకల కళా వల్లభుడి అండ తో ప్రత్యేక దూత గారు ఒక గ్యాంగ్ ని తయారు చేసుకుని వారితో కలిసి పిచ్చి గంతులు అరుపులతో ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తుంటే పెట్టుబడి పెట్టిన ఎ తండ్రి కడుపు మండదు ??
తమ అపారమైన కళా నైపుణ్యం తో , ప్రజల నాడి తమకు మాత్రమే తెలుసు అని పిచ్చి విశ్వాసం తో బాపు రమణ వంటి దిగ్గజాలను అవమానించడం , దూత గారి సకల కళలకు ETV ( Hero, villain , character artist , comedy , romance , anchoring , news ఒక్కటి చదవలేదనుకుంట !!!!) పూర్తి స్థాయి వేదిక గా మారిపోవడం , ఈ వికృత చేష్టలు భరించలేక ప్రజలు ETV అంటే భయపడే పరిస్తితి కి రావడం తో ఇద్దరిని వెళ్ళగొట్టి రామోజీ మంచి పని చేసారు అని చెప్పవచ్చు.

73 సంవత్సరాల వయసులో ramoji rao gaaru , ప్రభుత్వం లోని అన్ని శాఖలు కలిసి చేస్తున్న దాడులను , వత్తిళ్ళను , ఎ మాత్రం బెదరక ఒంటి చేత్తో ఎదుర్కుంటూ , తను నమ్మిన విలువలకి అనుగుణం గా తన సంస్థ లను నడిపిస్తున్న తీరు అనితరసాధ్యం . వుదాహరణకి ETV సంస్కరణల లో భాగం గా, కొడుకు చేసే ప్రోగ్రామ్స్ సైతం ప్రసారానికి ముందు ప్రివ్యూ కమిటి ఆమోదం తీస్కోమని ఆదేశించడం అభినందనీయం. ( ఈ రోజు ఇంటర్వ్యూ లో వారు చెప్పిన విషయమే , తెలిసో తెలియకో మొత్తం ఇంటర్వ్యూ లో ఎక్కువగా ఇలాంటి విషయాలే చెప్పి , ఈ మొత్తం వ్యవహారం లో రామోజీ తప్పేమీ లేదని వారే చెప్పకనే చెప్పారు ).

వ్యాపార పరం గా దెబ్బ తీయలేక , మానసికం గా నైన దెబ్బ తీద్దామనే సాక్షి వికృత పోకడ , అసలే అంతంత మాత్రం గా వున్నా దాని స్థాయి మరింత దిగాజార్చుకుంది .

ఈ మధ్యే ఈనాడు లో సత్యవేడు SEZ అక్రమాల పై ప్రత్యేక కథనం రావడం తో ఎప్పుడెప్పుడా ని ఎదురుచూస్తున్న TV9 , పొద్దున్నుంచి దీన్ని భూతద్దం లో చూపడానికి పడరాని పాట్లు పడుతుంది .

LET TRUTH PREVAIL .... ABOVE ALL ..................









Friday, October 31, 2008

ఛీ .... ఇది చట్టాలు చేసే ప్రభుత్వమేనా ......

ఈరోజు ఈనాడు పేపర్ చూసారా ...... ఘనత వహించిన మన ప్రభుత్వ నకిలీ ప్రకటన చూసారా ..... పనికి రాని పథకాలతో ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం, బరితెగించి , తామే చేసిన చట్టాలు తలవంచుకునేలా , నిస్సుగ్గుగా , నకిలీ ప్రకటనలతో తాము, అమాయకులు ఏమి చెప్పిన వింటారు అనే మూర్ఖత్వంతో పాఠకులను మోసం చేయడానికి తెగబడిన విధం చూసారా .................... !

..... ఖచ్చితం గా ఈనాడు మొదటి పేజి ని పోలిన ప్రకటన తయ్యారు చేసి , ఆఖరికి రొజూ వచ్చే శ్రీధర్ 'ఇది సంగతి 'కార్టూన్ ని కూడా 'ఇదే సంగతి' గా మార్చి , తామూ సాధించినా ఘనతలను, పత్రిక ప్రచురించినట్టుగా రూపొందించి విడుదల చెయ్యడం చూస్తుంటే , ప్రభుత్వాలు కూడా ఇంత దిగజారి ప్రవర్తించడం మాటల్లో చెప్పలేని అసహ్యాన్ని, కంపరాన్ని కలిగిస్తున్నాయి.

ప్రజాస్వామ్యం లో ఇంతటి బరితెగించిన తనాన్ని , ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని , నిస్సుగ్గు గా ప్రదర్శిస్తున్న ఈ ప్రభుత్వాన్ని , ప్రభుత్వం అనాలో లేక ఇంకేమి అనాలో ఎవరైనా చెప్తారా ..............?
అసలు ఈనాడు డబ్బు కోసమే మొదటి పేజి లో ఈ ప్రకటన ప్రచురించింది అని అనాలనుకునేవాళ్ళు , ప్రభుత్వ ప్రకటనలు , ప్రచురణ వాటి మార్గదర్శకాలు చదివి అనమనమని మనవి .
ఇంకొకటి ప్రత్యర్ధి పక్షాల విజయవంతమైన సభలు కాని , మార్గ ప్రదర్శనలు గాని జరిగినప్పుడు వాటికి సరి ఐన ప్రచారం లభించకుండా మరుసటిరోజు ప్రజలు ఆదరించే పత్రికల మొదటి పేజి లను ఈవిధంగా తమ నకిలీ ప్రకటనలతో hijack (తెలుగు పదం ఎవరైనా చెప్పండి దయచేసి )చేస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ.

కొంచం చూసి గురూ ....... !!