Sunday, April 12, 2009

సర్వే లు , ఫలితాలు .... వాస్తవాలు ....

ఈ మధ్య అన్ని పత్రికలూ, చానల్స్ రక రకాల ఏజెన్సీ లతో సర్వే లు చేపించి , వాటి ఫలితాలను ప్రజల మీదకు యదేచ్చగా వదులు తున్నాయి . ఐతే ప్రస్తుతం మన రాష్ట్రం లో నెలకొనివున్న ప్రత్యేక పరిస్థితులు వాటి ఫలితాలును నిజం గా ఈ సర్వేలు ప్రతిబింబిస్తున్నాయ అనేది పూర్తిగా అనుమానాస్పదం .

ఇందులో విశేషం ఏమిటంటే , ఈ సర్వే లు చేసే పత్రికలూ కాని చానల్స్ కాని ఈ సర్వే లకు ఎ మాత్రం భాద్యత వహించవు, తమ ముసుగులు ఐన ఈ సర్వే ఏజెన్సీ ల పేరుతో ఫలితాలను తమకు అనుకూలం ఐన పార్టీ లకు లాభం కలిగించేలా విడుదల చేస్తున్నై అనే తీవ్రమైన అనుమానాలు వున్నాయి .

.... రేపొద్దున్న ఏమైనా తేడాలు వస్తే , మాకు ఏమి సంబంధం లేదు , కేవలం ఆ ఏజెన్సీ చేసిన సర్వే తాలూకు ఫలితాలు మాత్రమే మేము ఇచ్చాము అని ఎంచక్కా తప్పించుకోవచ్చు.
.... మన దేశం లో ఇంతవరకు ఎ సర్వే ఏజెన్సీ కూడా వరసగా రెండు మూడు ఎన్నికల లో , కచ్చితమయిన pre poll projections ఇచిన విశ్వసనీయమయిన ఏజెన్సీ కూడా ఏది లేదు .

.... సరే మరి ఇంతకూ ఈ సర్వే లు మన రాష్ట్రం లో కింది విషయాలను పరిగణన లోకి తీస్కున్నాయా అనేది అనుమానమే ....

- తెలంగాణా వాదం
- PRP ఖాతా లో పడనున్న ఒక బలమయిన సామాజిక వర్గ వోట్లు (ఇందులో మెజారిటీ వోట్లు ఇంతకు ముందు కాంగ్రెస్ కి దక్కేవి అనేది ఒక విశ్లేషణ )
- తెలుగుదేశం వోట్ల మీద లోక్ సత్తా చూపనున్న ప్రభావం
- ఎంతో కొంత ప్రబావం చూపనున్న నగదు బదిలీ మరియు వుచిత కలర్ టీవీ

ఇవి కీలకమయిన విషయాలు ఎందుకంటే , ఇంతకు ముందు నాలుగు ఐదు ఎన్నికల్లో , తెలుగు దేశం కాంగ్రెస్ ఎవరి వోట్లు వారికి పోల్ కాగ , తటస్తులు ఎవరి వయిపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారం చేపట్టేది .

ప్రస్తుతం కొత్తగా వచ్చిన PRP , లోక్ సత్తా తో పాటు , మహా కూటమి గా మారిన ప్రతిపక్షాలు , వీటితో తటస్థులు అనే వర్గం పూర్తిగా కుంచించుకు పోయి , అందరు ఏదో ఒక పార్టీ అని డిసైడ్ అయిపోయిన ప్రత్యేక పరిస్థితులు ఈ ఎన్నికల్లో కనబడుతున్నాయి . ఈ పరిస్థితుల్లో ఎ నియోజకవర్గం లో ఎ పార్టీ గెలిచినా అతి తక్కువ మెజారిటీ తో బయటపడే సూచనలు కనబడుతున్నాయి . ఈ మెజారిటీ లో కూడా పైయిన చెప్పిన విషయాలు కీలక భూమిక వహిస్తాయి .

ఈ పరిస్థితుల్లో , ఎ ఏజెన్సీ కూడా ఎంత నిజాయితి గా సర్వే చేసినా కూడా అసలైన ఫలితాలను ప్రతిబింబించలేని పరిస్తితి .

సరే వీటిని పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రం లో ప్రధాన పార్టీ ల పరిస్థితులు ఇలా వున్నాయి.

కాంగ్రెస్ : ఉత్తర తెలంగాణా లో పూర్తిగా దక్షిణ తెలంగాణా (ఖమ్మం , మహబూబ్నగర్ .....) లో చాల వరకు , ఉభయ గోదావరి జిల్లాలు ల లో పూర్తిగా ఆశలు వదులు కున్న పరిస్తితి .

PRP : తెలంగాణా లో పూర్తిగా (దేవేందర్ గౌడ్ నియోజక వర్గాలతో సహా ) , రాయలసీమ లో అనంతపూర్ , కడప ల లో పూర్తిగా , నెల్లూరు , ప్రకాశం వంటి చోట్ల మెజారిటీ నియోజకవర్గాల్లో పోటి లో లేని పరిస్తితి ....
.
మహాకూటమి : ఫలితాలు ఎలా వుండబోతున్నా , ఉత్తరాంధ్ర , హైదరాబాద్ పాతబస్తీ , కోస్తా లోని అతి తక్కువ నియోజక వర్గాలు మినహాయించి , రాష్టం లోని మిగతా అన్ని నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్ధులు ప్రధాన పోటిదారులు గా వున్నారు .

No comments: