Friday, November 21, 2008

జిందాబాద్ రామోజీ .....

ఈనాడు ని , రామోజీ ఇతర వ్యాపారాలను దెబ్బతీయటానికి పలు రకాలుగా ప్రయత్నించి , తమ వల్ల కాదు అని ఆలస్యం గా కళ్లు తెరిచిన సాక్షి యాజమాన్యం , తెలుగు మీడియా లో రామోజీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ , రామోజీ పబ్లిక్ పర్సనాలిటీ గా మారడం వల్ల ఆయన కుటుంబ వ్యవహారాలు ప్రజలకి తెలియ చెప్పాలనే ఈ ఇంటర్వ్యూ ప్రచురిస్తున్నాం అంటు తమ అతి తెలివిని , లేకితనాన్ని బయటపెట్టుకున్నారు.

కళ తప్ప మరొకటి తెలియని ఒక సకల కళా వల్లభుడి అజ్ఞానం అమాయకత్వం ఆసరాతో , ఆయనకు ఇహలోక జ్ఞానం ప్రసాదించడానికి పంపబడ్డ ఒక దూత సహకారం తో , రామోజీ కుటుంబాన్ని బజారుకీడుద్దామన్న కుటిల యత్నం లో సాక్షి బొక్క బోర్లా పడిందని ఇంటర్వ్యూ చదివిన వాళ్ళందరి మాట.

మొత్తం ఇంటర్వ్యూ జాగ్రత్త గా చదివిన తర్వాతా రామోజీ మీద గౌరవం మరింత పెరిగింది .

ఎవరికైనా తెర మీద కనపడాలనే కుతి ఎక్కువ గా వుంటే , తమ పెట్టుబడి తో పెట్టుకున్న ఛానల్ లో తమ ప్రతిష్త పెరిగే కార్యక్రమాలను రూపొందిచుకుంటారు . కాని ప్రత్యేక దూత ల చెప్పుడు మాటలు విని , విచిత్రమైన వేషాలతో కోట్ల మంది ప్రజల ముందు తన పరువు తానె తీసుకుంటున్న క్రమం లో , వీల్లిద్దరిని వెళ్ళగొట్టి ఛానల్ పేరు ని కొడుకు పరువు ని రామోజీ కాస్తైనా నిలబెట్టారు .

అదీ గాక ఈ సకల కళా వల్లభుడి అండ తో ప్రత్యేక దూత గారు ఒక గ్యాంగ్ ని తయారు చేసుకుని వారితో కలిసి పిచ్చి గంతులు అరుపులతో ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తుంటే పెట్టుబడి పెట్టిన ఎ తండ్రి కడుపు మండదు ??
తమ అపారమైన కళా నైపుణ్యం తో , ప్రజల నాడి తమకు మాత్రమే తెలుసు అని పిచ్చి విశ్వాసం తో బాపు రమణ వంటి దిగ్గజాలను అవమానించడం , దూత గారి సకల కళలకు ETV ( Hero, villain , character artist , comedy , romance , anchoring , news ఒక్కటి చదవలేదనుకుంట !!!!) పూర్తి స్థాయి వేదిక గా మారిపోవడం , ఈ వికృత చేష్టలు భరించలేక ప్రజలు ETV అంటే భయపడే పరిస్తితి కి రావడం తో ఇద్దరిని వెళ్ళగొట్టి రామోజీ మంచి పని చేసారు అని చెప్పవచ్చు.

73 సంవత్సరాల వయసులో ramoji rao gaaru , ప్రభుత్వం లోని అన్ని శాఖలు కలిసి చేస్తున్న దాడులను , వత్తిళ్ళను , ఎ మాత్రం బెదరక ఒంటి చేత్తో ఎదుర్కుంటూ , తను నమ్మిన విలువలకి అనుగుణం గా తన సంస్థ లను నడిపిస్తున్న తీరు అనితరసాధ్యం . వుదాహరణకి ETV సంస్కరణల లో భాగం గా, కొడుకు చేసే ప్రోగ్రామ్స్ సైతం ప్రసారానికి ముందు ప్రివ్యూ కమిటి ఆమోదం తీస్కోమని ఆదేశించడం అభినందనీయం. ( ఈ రోజు ఇంటర్వ్యూ లో వారు చెప్పిన విషయమే , తెలిసో తెలియకో మొత్తం ఇంటర్వ్యూ లో ఎక్కువగా ఇలాంటి విషయాలే చెప్పి , ఈ మొత్తం వ్యవహారం లో రామోజీ తప్పేమీ లేదని వారే చెప్పకనే చెప్పారు ).

వ్యాపార పరం గా దెబ్బ తీయలేక , మానసికం గా నైన దెబ్బ తీద్దామనే సాక్షి వికృత పోకడ , అసలే అంతంత మాత్రం గా వున్నా దాని స్థాయి మరింత దిగాజార్చుకుంది .

ఈ మధ్యే ఈనాడు లో సత్యవేడు SEZ అక్రమాల పై ప్రత్యేక కథనం రావడం తో ఎప్పుడెప్పుడా ని ఎదురుచూస్తున్న TV9 , పొద్దున్నుంచి దీన్ని భూతద్దం లో చూపడానికి పడరాని పాట్లు పడుతుంది .

LET TRUTH PREVAIL .... ABOVE ALL ..................









6 comments:

Naveen Garla said...

మా నాన్న క్రూరత్వం, తత్వం ఇది అని చెప్పే క్రమంలో తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు సుమన్. "మేమెక్కడున్నామో ఏమిచేస్తున్నామో" అని ఆందోళన చెందే అభిమానుల కోసం ఇంటర్వ్యూ ఇచ్చారట. హమ్మయ్య పీడ విరగడ అయ్యిందిరా నాయనా అని అందరూ అనుకోవడం వాళ్ళ చెవులకు వినపడలేదు అనుకుంటా. మొత్తానికి సుమన్ బాధేమిరా అంటే, మా నాయన ముసలోడు...తను సంపాదించుకున్న వేల కోట్ల ఆస్తి నా పేరున రాసేసి ఓ మూల కూర్చుని రామా కృష్ణా అనుకోవచ్చు కదా అని. ఇలా తండ్రి సంపాదించిన ఆస్తిని ఆశించి తండ్రినే క్షోభపెట్టే కొడుకులను ఏం చేసినా పాపం లేదు.

krishna rao jallipalli said...

ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అని ఇంత కాలం ఎదురు చూస్తుంటే.. పిడుగు లాంటి ఇంటర్ వ్యూ. ఇక వచ్చే ఛాన్స్ లేదు. మరి మనందరం వారి కామెడి లీలలని చూసి ఎలా enjoy చేయాలి?? మార్గమేది?? పరిష్కారమేది?? ఒక పని చేద్దాం - 'సుమనా-ప్రభ' అనే ఒక బ్లాగు ని మొదలపెట్ట మందాం??

Anonymous said...

ఇంటర్వ్యూలో సుమను చెప్పినదాని వల్ల రామోజీరావు ప్రతిష్ఠ పెరిగేదేగానీ, వీసమెతు కూడా నష్టం లేదు. ఈళ్ళిద్దరూ తమ ఎదవాయిత్వాన్ని బయటేసుకున్నారంతే. ఇట్స్ అఫిషియల్ నౌ!

Satyamma said...

కీమో ధెరపీ చాలా బాధ. అది పడే వాళ్ళకు తెలుసు దాని బాధ..

ఇక్కడ (సు)మనోవేదన: http://telugu.greatandhra.com/mbs/exatra/sumano_21.php చదవండి... రాసి
నది సాక్షీ కాదు.

మధు said...

'ఇదేలే తరతరాల చరితం........'

- గొప్పోళ్ళు,పెద్దోళ్ళ జీవితాలన్నీ చాలావరకూ ఇంతే, ఏదో ఓ రోజు రోడ్డున పడటమే...చిరు,ఎంటీవోడు,రామోజీ...ఎవరూ మినహాయింపు కాదు.

Anonymous said...

నేటి తెలుగు పత్రికా రంగంలో దిగజారుతున్న విలువలని బట్టబయలు చేసింది - సాక్షి. దురదృష్టం ఏమిటంటే - సుమన్ దానికో పనిముట్టు అయ్యాడు.