ఈరోజు ఈనాడు పేపర్ చూసారా ...... ఘనత వహించిన మన ప్రభుత్వ నకిలీ ప్రకటన చూసారా ..... పనికి రాని పథకాలతో ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం, బరితెగించి , తామే చేసిన చట్టాలు తలవంచుకునేలా , నిస్సుగ్గుగా , నకిలీ ప్రకటనలతో తాము, అమాయకులు ఏమి చెప్పిన వింటారు అనే మూర్ఖత్వంతో పాఠకులను మోసం చేయడానికి తెగబడిన విధం చూసారా .................... !
..... ఖచ్చితం గా ఈనాడు మొదటి పేజి ని పోలిన ప్రకటన తయ్యారు చేసి , ఆఖరికి రొజూ వచ్చే శ్రీధర్ 'ఇది సంగతి 'కార్టూన్ ని కూడా 'ఇదే సంగతి' గా మార్చి , తామూ సాధించినా ఘనతలను, పత్రిక ప్రచురించినట్టుగా రూపొందించి విడుదల చెయ్యడం చూస్తుంటే , ప్రభుత్వాలు కూడా ఇంత దిగజారి ప్రవర్తించడం మాటల్లో చెప్పలేని అసహ్యాన్ని, కంపరాన్ని కలిగిస్తున్నాయి.
ప్రజాస్వామ్యం లో ఇంతటి బరితెగించిన తనాన్ని , ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని , నిస్సుగ్గు గా ప్రదర్శిస్తున్న ఈ ప్రభుత్వాన్ని , ప్రభుత్వం అనాలో లేక ఇంకేమి అనాలో ఎవరైనా చెప్తారా ..............?
అసలు ఈనాడు డబ్బు కోసమే మొదటి పేజి లో ఈ ప్రకటన ప్రచురించింది అని అనాలనుకునేవాళ్ళు , ప్రభుత్వ ప్రకటనలు , ప్రచురణ వాటి మార్గదర్శకాలు చదివి అనమనమని మనవి .
ఇంకొకటి ప్రత్యర్ధి పక్షాల విజయవంతమైన సభలు కాని , మార్గ ప్రదర్శనలు గాని జరిగినప్పుడు వాటికి సరి ఐన ప్రచారం లభించకుండా మరుసటిరోజు ప్రజలు ఆదరించే పత్రికల మొదటి పేజి లను ఈవిధంగా తమ నకిలీ ప్రకటనలతో hijack (తెలుగు పదం ఎవరైనా చెప్పండి దయచేసి )చేస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ.
కొంచం చూసి గురూ ....... !!
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
నేను కూడా చూసాను, ఇది ఎంతైనా విపరీత ధోరణే.
చాలా వెగటు కలిగించేలా ఉందా ప్రకటన!
మన వ్యవస్థ లొ ఈ సొ కాల్ద్ త్యగధనులు అవినీతిని ఒక వ్వాక్సిన్ లాగ ప్రజలకు కూదా అలవాతు చెసారు. మా అల్లుదికి జీతం కంతె గీతం ఎక్కువ అని సగర్వంగ చెప్పుకొనె రొజులు వచ్హెసై. మార్పు రావలంతె పందు కుల్లవలసినదె. చుద్దాం ఎప్పుదు కుల్లుతొందు
How did they do that?
eenadu must have sold them the space, right? Why would eenadu do that?
Post a Comment