సమైక్య వాదానికి కట్టుబడ్డ వ్యక్తి గా గౌరవమ్ ఇచ్చిన వారందరూ ఎన్నికల్లో నిండా ముంచిన విషయాన్ని చంద్రబాబు ఎలా మర్చి పోగలరు ? ( ముఖ్యం గా కృష్ణ , గుంటూరు , ప్రకాశం , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు .) అదే సమయమ లో సమైక్య వాద పార్టీ గా తెలంగాణా వాదుల మద్దతు కోల్పోయిన విషయాన్ని గమనించ కుండా ఎలా వుండగలరు .
తెలంగాణా లో TRS తో కాంగ్రెస్ కాని తెలుగుదేశం గాని ఎ ఒక్క పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ కూటమి తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది అని సర్వే ల తో నిమిత్తం లేకుండా అన్ని ఎన్నికలు రుజువు చేస్తున్నప్పుడు చంద్రబాబు చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి . కాంగ్రెస్ కి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? సమైక్య వాదుల మద్దతు లేని సమైక్య వాదాన్ని సమర్ధించడం కంటే , తమకు మద్దతు ఇస్తే చాలు తమ అభిమానాన్ని వోట్ల వర్షం గా కురిపిస్తున్న తెలంగాణా వాదానికి మద్దతు పలకడం దిగజారుడు తనం ఎలా అవుతుంది ??
సమైక్య వాదం ఒక వాదం మరియు నినాదం మాత్రమె ..... దానికో వుద్యమ రూపు కాని , వోటు బ్యాంకు కాని లేవు . సమైక్య వాదులకు , సమైక్య వాదం అనేది ఎన్నికల్లో ఒక అంశమే కాదు . వారికి గుర్తోచినప్పుడల్లా కలిసుంటే బావుంటుంది అని మాత్రం అంటారు .
పోనీ వోట్ల సంగతి పక్కన పెడితే ,
తెలంగాణా లో మెజారిటీ ప్రజలు తెలంగాణా ను కోరడం వాస్తవం . తెలంగాణా వుద్యమ పార్టీ TRS , గెలిచిన సీట్ల తో సంబంధం లేకుండా తెలంగాణా లో పెద్ద పార్టీ గా అవతరించడం వాస్తవం . ఈ పరిస్థితుల్లో, తెలుగువారి ఆత్మగౌరవం నినాదం తో పుట్టిన తెలుగు దేశం, తెలుగువారి మనోభావాలను (ఎ ప్రాంతం ఐన సరే ) కూడా అదే స్తాయి లో గుర్తించాలి .... దాని కోసం తన వాదాలను మార్చుకోవడం లో లేదా సమీక్షించుకోవడం లో ఏమి తప్పు లేదు .
1 comment:
మంచి విశ్లేషణ. అభినందనలు.
సమైక్య వాదం అసలు ఒక వాదమే కాదు.
బలవంతులు దుర్బల జాతిని దోచుకునేందుకు వల్లించే మోసపూరిత నినాదం.
ఒకర్ని ఒకరు అనుమానించుకుంటూ అవమానించుకుంటూ , అన్యాయం చేస్తూ సమానత గానీ పరస్పర అభిమానం గాని లేకుండా సమైక్యం గా వుండాలని కోరుకోవడం అర్ధరహితం.
విడిపోయి ఎదిగినప్పుడే పరస్పర గౌరవ భావం ఏర్పడుతుంది.
తెలంగాణా ప్రజలు తమ ఉనికి కోసం అస్తిత్వం కోసం తహ తహ లాడుతున్నారు. అందుకే ఎవరు ప్రత్యెక రాష్ట్ర నినాదం ఇచ్చినా వారికి పట్టం కడుతున్నారు..
కొందరు ఇంటి దొంగలు, బయటి దొంగలు ఆ బలహీనతను సొమ్ము చేసుముని తెలంగాణాకు ద్రోహం చేస్తూనే వున్నారు.
ఈ అంతులేని కథకు వ్యధకు ముగింపు ఎన్నడో...
ప్రభాకర్ మందార
Post a Comment