ఈ మధ్య అందరు తెగ బాధపడుతున్నారు ..... చంద్రబాబు వాడుకుని వదిలేసే రకమని , బాలయ్య , జూనియర్ ఇద్దరినీ ఎన్నికల్లో వాడుకుని తర్వాత వదిలేస్తాడు అని , చంద్రబాబు నైజమే అది అని , బాబు బుట్టలో పడొద్దని ఉపదేశాలు ఇస్తున్నారు .
సరే మరి ఏమి చేస్తే బాగుంటుంది . పత్రికలూ , చానల్స్ పెట్టుకోమని వందల కోట్లు దోచిపెట్టాలా ? సెజ్ లు రాసివ్వాలా ?
ఎన్నికల్లో వుపయోగ పడ్డారని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి రాష్ట్రాన్ని ఏలుకోమని చెప్పాలా ? అడిగినవారికి కాదనకుండా ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టాలా ? నామినేషన్ పద్దతుల్లో వందల కోట్ల కాంట్రాక్టులు అప్పగించాలా ?
ముఖ్యం గా తెలుగు వారు చాలా మంది , తమకి ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు కాని , నమ్మిన వారికి అన్యాయం చేసాడు అని తెగ బాధపడతారు .
తమ బంధు మిత్ర సపరివారానికి అన్ని రకాలుగా సహాయం చేస్తుంటే , అదేదో తమకే అందినంత తృప్తి పడతారు .
ఈ బలహీనత చూస్కునే , మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశాల్లో బహిరంగం గానే నమ్మిన వారికి అన్ని రకాలు గా సహాయం చేశాను అని చెప్తుంటారు .
అది కాకుండా ప్రచారం కూడా .... చంద్రబాబు గుంట నక్క అని , నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుతాడు అని . అంతెందుకు చాల మంది బాబు అభిమానులు కూడా , మా నాయకుడి లో ఇదొక్కటే లోపం అని చెప్తుంటారు .
వ్యక్తిగత జీవితం లో ఈ నమ్మిన వారిని ఆదుకొవడం అనే కాన్సెప్ట్ బాగానే వుంటుంది .... కాని అధికారం లో వుండే వాళ్ళు కూడా అలానే వుండాలి అని ఆశిస్తే ఏమి జగుతుందో , గత 5 సంవత్సరాలుగా చూస్తూనే వున్నాము . అధికార పార్టీ నాయకులూ వారి బంధువులు మిత్రులు ..... తామే వుహించని సంపదని కూడబెట్టారు , మనం మాత్రం నమ్మిన వారిని నెత్తిన పెట్టుకునే నాయకుడికి అధికారం అప్పగించామని తృప్తి గా వున్నాము .
ప్రజలు ఆకర్షించే శక్తి గల కుటుంబ సభ్యులు వున్నప్పుడు .... వారిని ప్రచారాని కి వాడుకోవటం లో తప్పేముంది . అధికారం లోకి వచ్చిన తర్వాత వారిని ప్రభుత్వ కార్య కలాపాలకు దూరం గా వుంచటం వదిలెయ్యడం ఎలా అవుతుంది .
తొమ్మిది సంత్సరాలు అధికారం లో వున్నా బాబు ...ఎ రోజు కుటుంబ సభ్యులను అధికార విధుల్లో జోక్యం చేసుకోనివ్వలేదు . ఎవరి మీద ఆరోపణలు కూడా రాలేదు .
వాడుకుని వదిలేసే టైపు (కుటుంబ సభ్యులని ), తన నీడని తానె నమ్మడు , అనుమానపు మనిషి , పని రాక్షసుడు , ఇవన్ని వున్నవాడు అధికారం లో వుంటేనే అసలు ప్రజలకి మేలు జరుగుతుంది .
అభిమానుల ఆశలు ఫలించి ,బాబు మళ్ళి అధికారం లోకి వస్తే తన పూర్వ పంధానే కొనసాగించాలని కోరుకుంటున్నాను .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
నిజమే. చంద్రబాబు అధికారంలో ఉండగా సొంత వాళ్లని చాలా దూరం పెట్టాడు - తమ్ముడితో సహా. ఐతే, అది ఎవరినీ నమ్మకపోవటం వల్ల కాదు. తనకి 'బంధు ప్రీతి' అపప్రధ వస్తుందనే భయం వల్ల. మిగతా సినిమాటిక్ వికారాలు ఎన్ని పోయినా, ఒక్క విషయం మాత్రం బాలకృష్ణ సరిగానే గుర్తు చేశాడు: 'తెదెపా అధికారంలో ఉండగా మా కుటుంబమెప్పుడన్నా ప్రభుత్వ లేదా పార్టీ వ్యవహారాల్లో కలగజేసుకుందా?' అని. (అఫ్‌కోర్స్, కలగజేసుకున్న కాలం ఒకటుంది. దాని ఫలితంగానే నాయకత్వం ఎన్టీవోడి చేతి నుండి బాబు చేతికొచ్చింది).
ఒకానొకప్పుడు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన పెద్ద మనిషి ఇప్పుడు ముఖ్యమంత్రై తెల్లారి లేస్తే అదే ఇందిరమ్మ జపంతో తరిస్తూ, మరో పక్క చంద్రబాబుని సందు దొరికినప్పుడల్లా వెన్నుపోటుదారుడని ఎత్తిపొడవటం ఎంత విడ్డూరంగా లేదు? రామారావుకి బాబు వెన్నుపోటు పొడిస్తే ఆంధ్రా జనాలకి పోయిందేమిటి, పొడవకపోతే వాళ్లకి వచ్చేదేమిటి? మనవాళ్లు అనవసరమైన విషయాలకి ఇచ్చే విలువ అవసరమైన వాటికిస్తే మనకింకా మంచి నాయకులే వచ్చుండేవాళ్లు.
Guys well said both of you
Post a Comment