Wednesday, March 18, 2009
వాడుకుని వదిలెయ్యక ఏమి చెయ్యాలి ...... ?
సరే మరి ఏమి చేస్తే బాగుంటుంది . పత్రికలూ , చానల్స్ పెట్టుకోమని వందల కోట్లు దోచిపెట్టాలా ? సెజ్ లు రాసివ్వాలా ?
ఎన్నికల్లో వుపయోగ పడ్డారని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి రాష్ట్రాన్ని ఏలుకోమని చెప్పాలా ? అడిగినవారికి కాదనకుండా ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టాలా ? నామినేషన్ పద్దతుల్లో వందల కోట్ల కాంట్రాక్టులు అప్పగించాలా ?
ముఖ్యం గా తెలుగు వారు చాలా మంది , తమకి ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు కాని , నమ్మిన వారికి అన్యాయం చేసాడు అని తెగ బాధపడతారు .
తమ బంధు మిత్ర సపరివారానికి అన్ని రకాలుగా సహాయం చేస్తుంటే , అదేదో తమకే అందినంత తృప్తి పడతారు .
ఈ బలహీనత చూస్కునే , మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశాల్లో బహిరంగం గానే నమ్మిన వారికి అన్ని రకాలు గా సహాయం చేశాను అని చెప్తుంటారు .
అది కాకుండా ప్రచారం కూడా .... చంద్రబాబు గుంట నక్క అని , నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుతాడు అని . అంతెందుకు చాల మంది బాబు అభిమానులు కూడా , మా నాయకుడి లో ఇదొక్కటే లోపం అని చెప్తుంటారు .
వ్యక్తిగత జీవితం లో ఈ నమ్మిన వారిని ఆదుకొవడం అనే కాన్సెప్ట్ బాగానే వుంటుంది .... కాని అధికారం లో వుండే వాళ్ళు కూడా అలానే వుండాలి అని ఆశిస్తే ఏమి జగుతుందో , గత 5 సంవత్సరాలుగా చూస్తూనే వున్నాము . అధికార పార్టీ నాయకులూ వారి బంధువులు మిత్రులు ..... తామే వుహించని సంపదని కూడబెట్టారు , మనం మాత్రం నమ్మిన వారిని నెత్తిన పెట్టుకునే నాయకుడికి అధికారం అప్పగించామని తృప్తి గా వున్నాము .
ప్రజలు ఆకర్షించే శక్తి గల కుటుంబ సభ్యులు వున్నప్పుడు .... వారిని ప్రచారాని కి వాడుకోవటం లో తప్పేముంది . అధికారం లోకి వచ్చిన తర్వాత వారిని ప్రభుత్వ కార్య కలాపాలకు దూరం గా వుంచటం వదిలెయ్యడం ఎలా అవుతుంది .
తొమ్మిది సంత్సరాలు అధికారం లో వున్నా బాబు ...ఎ రోజు కుటుంబ సభ్యులను అధికార విధుల్లో జోక్యం చేసుకోనివ్వలేదు . ఎవరి మీద ఆరోపణలు కూడా రాలేదు .
వాడుకుని వదిలేసే టైపు (కుటుంబ సభ్యులని ), తన నీడని తానె నమ్మడు , అనుమానపు మనిషి , పని రాక్షసుడు , ఇవన్ని వున్నవాడు అధికారం లో వుంటేనే అసలు ప్రజలకి మేలు జరుగుతుంది .
అభిమానుల ఆశలు ఫలించి ,బాబు మళ్ళి అధికారం లోకి వస్తే తన పూర్వ పంధానే కొనసాగించాలని కోరుకుంటున్నాను .
Sunday, March 15, 2009
జూనియర్ తో వణుకుతున్న కాంగ్రెస్ ...... ?
Monday, March 9, 2009
తెలుగు దేశం - తెలంగాణా వాదం ?
సమైక్య వాదానికి కట్టుబడ్డ వ్యక్తి గా గౌరవమ్ ఇచ్చిన వారందరూ ఎన్నికల్లో నిండా ముంచిన విషయాన్ని చంద్రబాబు ఎలా మర్చి పోగలరు ? ( ముఖ్యం గా కృష్ణ , గుంటూరు , ప్రకాశం , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు .) అదే సమయమ లో సమైక్య వాద పార్టీ గా తెలంగాణా వాదుల మద్దతు కోల్పోయిన విషయాన్ని గమనించ కుండా ఎలా వుండగలరు .
తెలంగాణా లో TRS తో కాంగ్రెస్ కాని తెలుగుదేశం గాని ఎ ఒక్క పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ కూటమి తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంది అని సర్వే ల తో నిమిత్తం లేకుండా అన్ని ఎన్నికలు రుజువు చేస్తున్నప్పుడు చంద్రబాబు చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి . కాంగ్రెస్ కి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? సమైక్య వాదుల మద్దతు లేని సమైక్య వాదాన్ని సమర్ధించడం కంటే , తమకు మద్దతు ఇస్తే చాలు తమ అభిమానాన్ని వోట్ల వర్షం గా కురిపిస్తున్న తెలంగాణా వాదానికి మద్దతు పలకడం దిగజారుడు తనం ఎలా అవుతుంది ??
సమైక్య వాదం ఒక వాదం మరియు నినాదం మాత్రమె ..... దానికో వుద్యమ రూపు కాని , వోటు బ్యాంకు కాని లేవు . సమైక్య వాదులకు , సమైక్య వాదం అనేది ఎన్నికల్లో ఒక అంశమే కాదు . వారికి గుర్తోచినప్పుడల్లా కలిసుంటే బావుంటుంది అని మాత్రం అంటారు .
పోనీ వోట్ల సంగతి పక్కన పెడితే ,
తెలంగాణా లో మెజారిటీ ప్రజలు తెలంగాణా ను కోరడం వాస్తవం . తెలంగాణా వుద్యమ పార్టీ TRS , గెలిచిన సీట్ల తో సంబంధం లేకుండా తెలంగాణా లో పెద్ద పార్టీ గా అవతరించడం వాస్తవం . ఈ పరిస్థితుల్లో, తెలుగువారి ఆత్మగౌరవం నినాదం తో పుట్టిన తెలుగు దేశం, తెలుగువారి మనోభావాలను (ఎ ప్రాంతం ఐన సరే ) కూడా అదే స్తాయి లో గుర్తించాలి .... దాని కోసం తన వాదాలను మార్చుకోవడం లో లేదా సమీక్షించుకోవడం లో ఏమి తప్పు లేదు .